రాష్ట్రం వచ్చాక కూడా మా పరిస్థితి ఘోరం: లెక్చరర్స్‌ జేఏసీ

రాష్ట్రం వచ్చాక కూడా మా పరిస్థితి ఘోరం: లెక్చరర్స్‌ జేఏసీ

బీజేపీ నేత వివేక్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన జేఏసీ

హైదరాబాద్‌, వెలుగు: మాజీ ఎంపీ, బీజేపీ నేత జి. వివేక్‌ వెంకటస్వామిని తెలంగాణ లెక్చరర్స్‌ జేఏసీ నేతలు గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ  కార్యాలయంలో కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఆయన దృష్టికి తీసుకొస్తూ వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తాము ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. కార్పొరేట్‌ కాలేజీల్లో 20 ఏళ్లుగా పని చేస్తున్న తెలంగాణ లెక్చరర్లను ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వివరించారు. తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెస్సీ చేసిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 9 వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, అదీ ఏడాదిలో పది నెలలే ఇస్తున్నారని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. న్యాయం జరిగేలా చేస్తానని వివేక్ వారికి హామీ ఇచ్చారు.

లఘు ఉద్యోగ భారత్‌(ఎల్‌యూబీ) సంఘం నేత విద్యాసాగర్‌, కార్యవర్గ సభ్యులు వివేక్‌ను కలిశారు.
బీజేపీలో చేరినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.