
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ రెండు కీలక బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది..ఆదివారం (ఆగస్టు31) న జరిగిన సమావేశాల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది.
సభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా.. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. రెండు బిల్లులకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. BRS తెచ్చిన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ను ఎత్తివేశారు. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అయింది.
మరో బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంట్ బిల్లుకు కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.