- ప్రపంచ ధ్యాన గురువు పత్రీజీ సతీమణి స్వర్ణమాల
ఆమనగల్లు, వెలుగు : ధ్యానంతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని ప్రపంచ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ సతీమణి స్వర్ణమాల పత్రీజీ తెలిపారు. కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ధ్యాన మహాయాగంలో శుక్రవారం ఆరో రోజు ఆమె పాల్గొని మాట్లాడారు.
ధ్యాన మహాయాగం కుంభమేళాను తలపిస్తుందన్నారు. మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురిని చూస్తే మరో ధ్యాన ప్రపంచం కనిపిస్తుందని వివరించారు. ప్రతి ధ్యాని వెంట పత్రీజీ ఆశయాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ధ్యానం, శాకాహార జగత్ కోసం కృషి చేసి స్వర్గీయ పత్రీజీ కన్న కలలను సాకారం చేయాలని సూచించారు.
అనంతరం జమ్మలమడుగు పిరమిడ్ మాస్టర్లు అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష, మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ శక్తిస్థల్ నిర్మాణానికి రూ. రెండు లక్షల విరాళాన్ని ట్రస్టు సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సభ్యులు శివప్రసాద్, సాంబశివరావు, దామోదర్ రెడ్డి, హనుమంతరావు, మాధవి, లక్ష్మి, జ్యోతి, నిర్మల, విజయభాస్కర్ నంద, మహేశ్వరి, మధు మోహన్, బాల కృష్ణ, రవిశాస్త్రి పాల్గొన్నారు.
