- అత్యధికంగా శంషాబాద్‌లో 100 వైన్స్‌లకు 8,536
- వనపర్తిలో 37 వైన్స్‌లకు 757 దరఖాస్తులే
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 27న(రేపు) ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాల లక్కీ డ్రా కు ఎక్సైజ్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ డ్రా నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియను కొనసాగనుంది. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో వైన్స్కోసం డిమాండ్ భారీగా ఉంది. శంషాబాద్‌లో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536 దరఖాస్తులు రాగా, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్‌లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు, మల్కాజ్‌గిరిలో 88 షాపులకు 5,168 దరఖాస్తులు దాఖలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే, నల్లగొండలో 155 షాపులకు 4,906 దరఖాస్తులు, ఖమ్మంలో 122 షాపులకు 4,430 దరఖాస్తులు, సంగారెడ్డిలో 101 షాపులకు 4,432 దరఖాస్తులు వచ్చాయి.
మిగిలిన జిల్లాల వివరాలను పరిశీలిస్తే... నిర్మల్‌లో 47 షాపులకు 3,002 దరఖాస్తులు, నిజామాబాద్‌లో 102 షాపులకు 2,786 , కరీంనగర్‌లో 94 షాపులకు 2,730, యాదాద్రి భువనగిరిలో 82 షాపులకు 2,776, సిద్దిపేటలో 93 షాపులకు 2,782, సూర్యపేటలో 99 షాపులకు 2,771 వచ్చాయి. అలాగే మహబూబ్‌నగర్‌లో 90 మద్యం దుకాణాలకు 2,487 దరఖాస్తులు, జగిత్యాలలో 71 వైన్స్‌లకు 1,966, వరంగల్ అర్బన్‌లో 65కు 3,175 దరఖాస్తులు వచ్చాయి.
తక్కువ సంఖ్యలో షాపులు ఉన్న జిల్లాల్లో సైతం అప్లికేషన్ల జోరు తగ్గలేదు. వరంగల్ రూరల్‌లో 63 షాప్‌లకు1,958, మహబూబాబాద్‌లో 59 వైన్స్‌లకు1,800, భూపాలపల్లిలో 60 వైన్స్‌లకు1,863, వికారాబాద్‌లో 59 వైన్స్‌లకు1,808 దరఖాస్తులు దాఖలయ్యాయి. మెదక్ లో 49 వైన్స్‌లకు1,920, కామారెడ్డిలో 49 షాపులకు 1,502, రాజన్న సిరిసిల్లలో 48 వైన్స్‌లకు1,381, జనగామలో 47 వైన్స్‌లకు1,697, పెద్దపల్లిలో 77 వైన్స్‌లకు1,507 అప్లికేషన్లు వచ్చాయి. తక్కువగా జోగులాంబ గద్వాల 36 వైన్స్‌లకు774, ఆదిలాబాద్ 40 వైన్స్‌లకు 771, వనపర్తిలో 37 వైన్స్‌లకు 757 అప్లికేషన్లు వచ్చాయి.
