ఐదుగురు డాక్టర్లపై మెడికల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ చర్యలు.. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ రద్దు

ఐదుగురు డాక్టర్లపై మెడికల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ చర్యలు.. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ రద్దు

హైదరాబాద్, వెలుగు: వైద్య వృత్తిలో నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన ఐదుగురు  డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను టెంపరరీగా రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ – 2002, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ –1968 ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ఐదుగురు డాక్టర్లు 10 రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు అప్పగించాలని ఆదేశాలిచ్చింది.

ప్రజారోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరించినందుకు గానూ ఆయా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ పై సమీక్షించి, రద్దు చేయాలని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులకు కౌన్సిల్ సిఫార్సు చేసింది. అర్హత లేని వైద్యులతో కలిసి స్పాన్సర్లుగా వ్యవహరించిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని3 ఆస్పత్రుల డాక్టర్లపై 6 నెలలు, హెయిర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ సర్జన్‌‌‌‌‌‌‌‌గా ప్రచా రం చేసుకున్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏడాది సస్పెన్షన్ విధించారు. సంగారెడ్డిలోని ఆస్పత్రి డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆరు నెలల సస్పెన్షన్ విధించారు.