రాజకార్ మూవీ వివాదంపై.. మంత్రి కేటీఆర్ ట్వీట్

రాజకార్ మూవీ వివాదంపై.. మంత్రి కేటీఆర్ ట్వీట్

రాజకార్ అనే ఒక విప్లవ పదం వెనుక తెలంగాణ సాయుధ పోరాట గాథలెన్నో కనిపిస్తాయి. ఇక కనిపించని మరెన్నో వెతలను, సామాన్యులు అనుభవించిన వేదనలను చూపించడానికి వస్తున్న మూవీ రజాకార్‌(Razakar) . ఇప్పుడు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం అంటూ రైటర్.. డైరెక్టర్ యాట సత్య నారాయణ రజాకార్‌ మూవీను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా రజాకార్ మూవీ నుంచి టీజర్ రిలీజైనా విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ మూవీతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది.

లేటెస్ట్గా ఈ మూవీ టీజర్ పై మంత్రి కేటీఆర్(KTR) ట్వీట్ చేస్తూ.. కొంతమంది తెలివి తక్కువ బీజేపీ జోకర్లు.. వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం.. తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించాలని చాలా కష్టపడతున్నారని కేటీఆర్ తెలిపారు. రజాకార్ సినిమా విషయంలోనూ అదే జరుతోందని.. దీన్ని తాము సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోలీస్‌లు కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా..ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ రిలీజ్కు ముందే వివాదాలు స్టార్ట్ అవ్వగా.. ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతాయో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ: హరిహర వీరమల్లు తో అద్భుతాన్ని చూస్తారు..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని..అందులో భాగంగానే రజాకార్ సినిమాను నిర్మిస్తున్నారని మజ్లిస్ బచావో తెహ్రీక్ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు. 75 ఏళ్లకు పైగా జరిగిన సంఘటనల ఆధారంగా  రజాకార్  చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో  మరింతగా చీలిక వస్తుందని... సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఆమోదం తెలపబోదన్నారు.  ప్రజలను రెచ్చగొట్టే సినిమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.  హింసను సృష్టించడం.. శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవడంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, సినిమా విడుదలకు ముందే నిషేధించాలని ఆయన అన్నారు.