హరిహర వీరమల్లు తో అద్భుతాన్ని చూస్తారు..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

హరిహర వీరమల్లు తో అద్భుతాన్ని చూస్తారు..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

సౌత్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది. తన గ్లామర్ డాల్ ఇమేజ్ ను చెరిపేసుకునేందుకు ఇస్మార్ట్ భామ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నిధి నటిస్తోంది. ఈ పీరియాడికల్ డ్రామాలో ఈ బ్యూటీకి యాక్టింగ్ కి స్కోప్ ఉన్నరోల్ దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు చూడని విధంగా నిధిని చూపించనున్నాడట డైరెక్టర్ క్రిష్. పంచమి పాత్రలో ఈ హీరోయిన్ నటించనున్నట్టు సమాచారం. తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. 

ALSO READ: మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వర రావు సెకండ్ లిరికల్ అప్డేట్

ఇక పవన్ కల్యాణ్ తన అభిమాన నటుడని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. ప్రేక్షకులు తెరపై ఓ అద్భుతాన్ని చూడబోతున్నారని ఇటీవల చెప్పుకొచ్చింది. సైమా అవార్డుల వేడుకలో ఈ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్ గా  నిలిచింది. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. రీసెంట్‌గా షేర్ చేసిన బోల్డ్ పిక్స్‌కి  రెండు గంటల్లో రెండు లక్షల లైక్‌లు వచ్చాయి.గార్జియస్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో కండల వీరుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చై సవ్యసాచి మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఇక పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.