RTC యూనియన్ లీడర్ల ఓవరాక్షన్‌ వల్లే సమ్మె: తలసాని

RTC యూనియన్ లీడర్ల ఓవరాక్షన్‌ వల్లే సమ్మె: తలసాని

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు
ప్రతిపక్షాలకు ఏ అంశాలు లేకపోవడంతో ఆర్టీసీ సమ్మెను నెత్తికెక్కించుకున్నారు
సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు
టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పాలేదు

మంత్రి తలసాని కామెంట్స్

కొంతమంది ఆర్టీసీ యూనియన్ లీడర్ల అత్యుత్సాహం వల్ల సమ్మెకు వెళ్లారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని చెప్పారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పాలేదని తలసాని అన్నారు. ప్రతిపక్షాలకు ఏ అంశాలు లేకపోవడంతో ఆర్టీసీ సమ్మెను నెత్తికెక్కించుకున్నారని చెప్పారు. పలు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయా ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేసుకుందా అని ప్రశ్నించారు.

కెరళా, వెస్ట్ బెంగాల్ లో ఆర్టీసీని విలీనం చేశారా అని అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని చెప్పారు. ఆర్టీసీ విలీనం అనే డిమాండ్ హేతుబద్ధమైనది కాదని చెప్పారు. యూనియన్ ఎన్నికల కోసమే ఆర్టీసీ సంఘాలు సమ్మె చేయిస్తున్నాయని తెలిపారు.

ఏపీలో జగన్ వాళ్ల వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆర్టిసి విలీనం చేశారని అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు మంత్రి తలసాని.