గవర్నర్‌‌‌‌ తమిళిసై నిర్ణయంపై మంత్రుల ఫైర్​

గవర్నర్‌‌‌‌ తమిళిసై  నిర్ణయంపై మంత్రుల ఫైర్​
  • ఎమ్మెల్సీలుగా అనర్హులనడం దారుణం: మంత్రి హరీశ్
  • రాజకీయాలకు అడ్డాగారాజ్​భవన్: ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దాసోజు శ్రవణ్‌‌‌‌, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిర స్కరిస్తూ గవర్నర్‌‌‌‌ తమిళిసై నిర్ణయించడం దారుణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సమాజంలోని వెను కబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌‌‌‌, కుర్ర సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారన్నారు. వారు తమతమ రంగాల్లో ప్రజలకు మేలుచేసే అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అలాంటివారికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌‌‌‌ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తే.. గవర్నర్‌‌‌‌ వారిద్దరు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలో సభ్యులుగా ఉండడం వల్ల అనర్హులనడం దారుణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఒకవేళ ఇదే అయితే.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై తెలంగాణ గవర్నర్‌‌‌‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తి కి రాష్ట్ర గవర్నర్‌‌‌‌గా ఇవ్వవచ్చా? సర్కారియా కమిషన్‌‌‌‌ ప్రతిపాదనల ప్రకారం చూస్తే గవర్నర్‌‌‌‌ పదవిలో తమిళిసై ఉండవద్దు.. మరి ఆమె ఎలా ఉన్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు పలువురిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎలా నియ మించారని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం.. బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా? అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్‌‌‌‌ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.

గవర్నర్​గా కొనసాగే నైతిక అర్హత లేదు

ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్న ర్ తమిళిసై రిజెక్ట్ చేయడంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు గవర్నర్​గా కొనసాగే అర్హత లేదన్నారు. గవర్నర్ తమిళిసై రాజ్ భవన్​ను రాజకీయాలకు అడ్డాగా మార్చుకున్నారని విమర్శించారు. శ్రవణ్, సత్య నారాయణకు రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం దుర్మార్గమన్నారు. తమిళి​సైకి నైతికవిలువలుంటే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.

కేబినెట్ నిర్ణయాన్నివ్యతిరేకించే అధికారం గవర్నర్​కు లేదు

గ‌‌‌‌వ‌‌‌‌ర్నర్ త‌‌‌‌మిళిసై పైబీఆర్ఎస్ ఎమ్మెల్సీ మ‌‌‌‌ధుసూద‌‌‌‌నాచారి మండిప‌‌‌‌డ్డారు. దాసోజు శ్రవ‌‌‌‌ణ్‌‌‌‌, కుర్రా స‌‌‌‌త్యనారాయ‌‌‌‌ణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల‌‌‌‌ను తిర‌‌‌‌స్కరించ‌‌‌‌డం అప్రజాస్వామికం అన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం గ‌‌‌‌వ‌‌‌‌ర్నర్‌‌‌‌కు లేద‌‌‌‌న్నారు.