
అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లను చూసి విస్మయం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రాజెక్టునా తెలంగాణకు లైఫ్ లైన్ అని చెప్పింది. ఈ ప్రాజెక్టు గురించా డిస్కవరీ లాంటి చానెళ్లలో గొప్పలు చెప్పుకుంది’ అని కామెంట్ చేశారు. ‘‘ఎక్కడ నీళ్లు కనిపించినా, అవి కాళేశ్వరం నీళ్లేనని చెప్పారు. బ్యారేజీకి ఇంత నష్టం జరిగితే, నాలుగైదు పిల్లర్లు మళ్లీ కడితే సరిపోతుందని అంటున్నారు. అసలు ఇంత పెద్ద పిల్లర్లను ఎలా తొలగించి, కొత్తగా కడుతారు” అని ఇంజనీర్లను ప్రశ్నించారు.
డైమండ్ కట్టింగ్ ద్వారా బ్యారేజీలోని మిగతా భాగాలకు నష్టం జరగకుండా పిల్లర్లు తొలగించి మళ్లీ నిర్మిస్తామని ఇంజనీర్లు వివరించారు. 22వ పిల్లర్ లోనూ నిలువునా పగుళ్లు రావడంతో, దాన్ని చూసి ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. 18వ పిల్లర్ ఫాండేషన్ నుంచి నీళ్లు ఉబికి వస్తుండడం, బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ ను ఇప్పటి వరకు తొలగించకపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మెయింట నెన్స్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిం చారా? అసలు ఈ బ్యారేజీ నిలుస్తుందా? లేదా? అని ఇంజనీర్లను ప్రశ్నించారు.