మోడల్ స్కూళ్లలో కొనసాగుతున్న అడ్మిషన్లు

మోడల్ స్కూళ్లలో కొనసాగుతున్న అడ్మిషన్లు
  • అందుబాటులో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్​సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. ఆరో తరగతితో పాటు ఇంటర్ ఫస్టియర్​లో సీట్లున్నాయని, ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు దగ్గరలోని మోడల్ స్కూళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. 

బుధవారం నాటికి ఆరో తరగతిలో 8,330 అడ్మిషన్లు, ఇంటర్ ఫస్టియర్​లో 11,205 మంది అడ్మిషన్లు పొందారని చెప్పారు. చాలా మోడల్ స్కూళ్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ గ్రామర్ కోర్సును నేర్పిస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుక్స్ ను అందిస్తామని, ఆడియో/ వీడియో క్లాసులు కొనసాగిస్తున్నామని వివరించారు.