ముదిరాజ్ లను బీసీ- ఎలోకి మార్చాలి

ముదిరాజ్ లను బీసీ- ఎలోకి మార్చాలి

ఖైరతాబాద్, వెలుగు: ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ– డి నుంచి బీసీ– ఎ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్​మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఖైరతాబాద్ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, అధ్యయన వేదిక చైర్మన్​ప్రొఫెసర్​రాములు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజ్​అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కుల గణన చేసి తమకు దక్కాల్సిన రాజకీయ పదవులను ఇవ్వాలని కోరారు. మెదక్ లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, బోదరబోయిన యాదగిరి,  రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దమ్మిగారి  కనకయ్య, కార్యదర్శి నీలం దుర్గేశ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ముందుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.