అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
  •     ర్యాకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీఎస్​పీఎస్సీ 

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్‌‌ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌(ఎంఏయూడీ)లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టులో నిర్వహించిన పరీక్షా ఫలితాలను టీఎస్ పీఎస్సీ బుధవారం రిలీజ్ చేసింది. పరీక్ష రాసిన 12,186 మంది అభ్యర్థుల జనరల్ ర్యాకింగ్ లిస్టు (జీఆర్​ఎల్)ను విడుదల చేశారు. వివరాలను https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో పెట్టినట్టు వివరించారు. త్వరలోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

కాగా, ఈ  పరీక్షల్లో ఐదో జోన్​కు చెందిన అభ్యర్థి 300 మార్కులకు గానూ  221.615 మార్కులు సాధించి టాపర్​గా నిలిచారు. కాగా..వివిధ రిక్రూట్మెంట్లకు సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు అన్ని రకాల సర్టిఫికేట్లను రెడీ చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ సూచించింది. స్టడీ, రెసిడెన్స్, కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, బీసీ నాన్ క్రిమిలేయర్, పీహెచ్ తో పాటు ఇతర రిజర్వేషనన్లకు సంబంధించిన సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలని కోరింది.