మున్సిపాల్టీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లుగా 69 మంది, మేయర్లుగా ఐదుగురు

మున్సిపాల్టీ  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లుగా 69 మంది, మేయర్లుగా ఐదుగురు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లల్లో వుమెన్​ పవర్​ పెరిగింది. తమకు కేటాయించిన రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాల్లోనేగాక జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్లలోనూ గెలిచి సత్తా చాటారు. 69 మున్సిపాల్టీల్లో చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లుగా, 5 కార్పొరేషన్లలో మేయర్లుగా మహిళలు కొలువుదీరారు. ఇందులో 8 మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒక మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరలే. రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేని డిప్యూటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవులనూ
దక్కించుకున్నారు.

సగం కంటే ఎక్కువే..

రాష్ట్రంలో 128 మున్సిపాల్టీలు, 13 కార్పొరేషన్లలో చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాల్లో సగం స్థానాలను మహిళలకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో భాగంగా 61 మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాలు, 4 మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాలు మహిళలకు దక్కాయి. మహిళలకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన స్థానాలతోపాటు జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న దమ్మాయిగూడ(మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మల్కాజిగిరి) మున్సిపాల్టీకి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాసుపతి ప్రణీత, ఆదిబట్ల చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొత్త హార్థిక, బొల్లారం చైర్ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కె.రోజారాణి ఎన్నికయ్యారు. అలాగే బీసీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవిని రుబీనాబేగం, ఎస్సీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవిని జంగం కళ, ఇబ్రహీంపట్నం చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవిని కప్పరి స్రవంతి, నార్సింగి మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవిని దర్గుపల్లి రేఖ కైవసం చేసుకున్నారు. ఎస్టీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మూడవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుర్గ ఎన్నికయ్యారు.

డిప్యూటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లు, డిప్యూటీ మేయర్లుగా..

31 మంది మహిళలు డిప్యూటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైన వారిలో సత్తుపల్లి- –తోట సుజలరాణి, మధిర-–ఎరమల విద్యాలత, సంగారెడ్డి- ‌‌‌‌‌‌‌‌–శంకరి లత, పెద్ద అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట-–సంపూర్ణరెడ్డి, తుర్కయాంజల్-–హరితగౌడ్, ఆదిబట్ల-–కళమ్మ, బోడుప్పల్​-–కొత్తలక్ష్మి రవిగౌడ్, తూంకుంట–- పన్నాలరాణి, మక్తల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–బాయికాటి అఖిల, కోస్గి- –కొడిగంటి అన్నపూర్ణ, వడ్డేపల్లి-–బంగారు సుజాత, కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- –మహముదాబేగం, కొత్తకోట-–జయమ్మ, దుబ్బాక-–అధికం సుగుణ, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–అనితారెడ్డి, రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– గండ్ర రమాదేవి, కోదాడ- –వెంపటి పద్మ, తాండూరు–-దీప, పరిగి-–ప్రసన్నలక్ష్మి, కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–ఉషారాణి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-శంషాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేగం, కామారెడ్డి-–ఇందు ప్రియ, కొత్తపల్లి-–బండ రాధ, చొప్పదండి-–ఇప్పనపల్లి విజయలక్ష్మి, ఎల్లారెడ్డి-–సుజాత, హుజురాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–కొలిపాక నిర్మల, జమ్మికుంట-–దేశిని స్వప్న, చండూరు–-సుజాత, పెద్దపల్లి-–నజ్మీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుల్తానా, ఆలేరు-–మాధవి, సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–సమత ఉన్నారు.