బొగత జలపాతం..భూతల స్వర్గం

బొగత జలపాతం..భూతల స్వర్గం

బొగత జలపాతం..భూతల స్వర్గం.  తెలంగాణ నయాగరా ప్రసిద్ధి గాంచిన బొగత..వరుణుడి జోరుతో కొత్త అందాలు సంతరించుకుంది. జల సవ్వడులతో కళకళలాడుతోంది. కొండల నుంచి నేలపై జాలువారుతున్న పాలదారలను చూసి పర్యాటకులు పులకించిపోతున్నారు. 

తెలంగాణ నయాగరా బొగత జలపాతం సందర్శకులను కనువిందు చేస్తోంది. వర్షాలు, వరదలతో  నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకర్షిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం.. పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ప్రస్తుతం బొగత జలపాతం అందాలకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. 

ఎలా వెళ్లాలి..?
బొగత జలపాతం హైదరాబాద్ నుండి 329 కిలోమీటర్ల దూరంలో ఉంది.  హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వరంగల్ కు వెళ్లాలి..అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే..ఏటూర్ నాగారం నుండి 23 కిలోమీటర్లు.., జయశంకర్ పట్టణం నుంచి 110 కిలోమీటర్లు.., వరంగల్ నుండి 123 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 243 కిలోమీటర్లు, భద్రాచలం నుండి 123 కిలోమీటర్లు ఉంది.