435 డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్​

435 డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్​
  • జులై 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
  • కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ సర్వీస్​కు వెయిటేజి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవఖాన్లు, ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఐపీఎం)లో ఖాళీగా ఉన్న 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్(డాక్టర్) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 271, మల్టీ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2లో 164 పోస్టులు ఉన్నట్టు పేర్కొంది. ఈ పోస్టులకు జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా బోర్డు వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో (https://mhsrb.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివి ఉండవని స్పష్టం చేసింది. 

ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన మార్కులకు 80 పాయింట్లు, కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 20 పాయింట్ల వెయిటేజీ కలిపి మెరిట్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తామని తెలిపింది. విదేశాల్లో చదివిన డాక్టర్ల ఎంబీబీఎస్ మార్కులకు బదులు, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంజీఈ మార్కును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లు, ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ట్రైబల్ ఏరియాలో పని చేసిన ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్లు, మిగిలిన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి 6 నెలల కాలానికి 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తామని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. కనీసం 6 నెలలు పనిచేసిన వారికి వెయిటేజీ వర్తిస్తుందని తెలిపింది.