ఆర్టీసీపై రాం మిరియాల ధూంధాం పాట

 ఆర్టీసీపై రాం మిరియాల ధూంధాం పాట

హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (MGBS) లో ‘తెలంగాణ ఆన్ ట్రాక్’ పాట ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్టీసీపై రాము మిరియాల పాడిన పాటను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ  వి.సి.సజ్జనార్ ఆవిష్కరించారు. ఆర్టీసీకి 90 ఏండ్ల చరిత్ర ఉందని..ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు ,బ్యూరో క్రాట్స్ ఎంతోమంది​ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని పేర్కొన్నారు. ఆర్టీసీ సామాన్యుడి నేస్తమని..ఆర్టీసీ పై సాంగ్ రూపొందించడానికి 2 నెలలు కష్టపడ్డామని చెప్పారు.  రాం మిరియాల పాడిన ఈ సాంగ్  ద్వారా ప్రజల్లోకి ఆర్టీసీ మరింత బలంగా వెళ్తుందని ఆకాంక్షించారు.   

ప్రైవేట్ రవాణా వ్యవస్థ పెరిగినా ఆర్టీసీని  ప్రజలు ఆదరిస్తున్నారని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు గురించి ప్రజలకు తెలియజెప్పడమే  ‘తెలంగాణ ఆన్ ట్రాక్’ సాంగ్ ఉద్దేశమన్నారు. ఆర్టీసీలో ప్రయాణించి క్షేమంగా, భద్రంగా గమ్యం చేరుకోవాలన్నారు. ఆర్టీసీతో ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని రామ్ మిరియాల ఈ పాట ద్వారా చెప్పడం గొప్ప విషయమన్నారు.  RTC మీద పాట రాయడానికి పెద్దగా కష్ట పడలేదని..ఆర్టీసీతో ఉన్న బంధం గుర్తు చేసుకుని పాట రాశానని రామ్ మిరియాల చెప్పారు. మధ్య తరగతి కుటుంబానికి ఆర్టీసీ బస్సు ఓ నేస్తం అన్నారు.