తెలంగాణ ప్లాస్మా డోనార్స్ ఆసోషియేషన్ ప్రారంభమైంది. అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోవిడ్-19 సోకిన వ్యక్తిని బతికించడానికి ఇద్దరి ప్లాస్మా సరిపోతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణలో పూర్తిగా వెనుకబడిందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, అందులో ఒక్క శాతం కోవిడ్ కోసం వెచ్చించినా.. కరోనా సమస్య గట్టెక్కుతుందని చెప్పారు. తాను కరోనా నుంచి కోలుకున్నానని, ఆ బాధ తనకు తెలుసని చెప్పారు. ఈ అసోసియేషన్‌ను రాజకీయాలతో సంబంధంలేని వారితో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లాస్మా తెరఫికి సంబంధించి ఒక అధికారిని కేటాయించాలని, విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వచ్చే దాతలు తమకు ఫోన్ చేస్తే ప్లాస్మా సేకరిస్తామని తెలిపారు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 9848044479, 7989262806, 9849461033, 7997934567.
