డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్ర పోలీసులు నంబర్ వన్..సీపీ ​సీవీ ఆనంద్, రాష్ట్ర పోలీసులను అభినందించిన సీఎం

డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్ర పోలీసులు నంబర్ వన్..సీపీ ​సీవీ ఆనంద్, రాష్ట్ర పోలీసులను అభినందించిన సీఎం

హైదరాబాద్​, వెలుగు: డ్రగ్స్​ (మాదక ద్రవ్యాల) నియంత్రణలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.138 దేశాలతో పోటీపడి తొలిస్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్ లో ‘ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్’ కేటగిరీలో ఆయన మొదటి బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని  సీపీ సీవీ ఆనంద్ కలవడంతోఆయనతో సహా పోలీసు సిబ్బందిని సీఎం అభినందించారు.