బార్డర్ దగ్గర ఏపీ అంబులెన్స్ లను అడ్డుకుంటున్న పోలీసులు

V6 Velugu Posted on May 10, 2021

తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను వెనక్కి పంపిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకు  తెలంగాణలోని ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులను అనుమతిస్తున్నారు. హాస్పిటల్స్  అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్తున్న అంబులెన్స్ లు బోర్డర్ దగ్గర వెనక్కి తిప్పి పంపుతున్నారు తెలంగాణ పోలీసులు. సాధారణ వాహన ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్నారు.

Tagged Impose Restrictions, telangana police, border

Latest Videos

Subscribe Now

More News