దేశంలోనే తెలంగాణ పోలీసు నెంబర్ ​వన్​

దేశంలోనే తెలంగాణ పోలీసు నెంబర్ ​వన్​

ముషీరాబాద్, వెలుగు: దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని హోం మంత్రి మహమూద్​ అలీ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే మొదటి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి  పోలీస్ శాఖలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్ ఎన్ ఆర్ క్రికెట్ మెమోరియల్ పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఇందులో హోం మంత్రి తో పాటు  సిటీ  సీపీ సీవీ ఆనంద్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బి. శ్రీనివాస్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ విజేత శ్రీకాంత్ టీం, రన్నర్ రెడ్ హిల్స్ టీంలకు మెమోంటోలు పంపిణీ చేశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాలను సమానంగా చూస్తూ వారి సంక్షేమానికి పాటు పడుతుందన్నారు. నాయిని నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో మరింత ఘనంగా నిర్వహించాలని కోరారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తమ బంగారు భవిష్యత్​కు బాటలు వేసుకోవాలని సిటీ సీపీ  ఆనంద్ సూచించారు.  రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, బేవరేజ్​బోర్డ్ చైర్మన్ గజ్జెల నగేష్, టూరిజం సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కాల్వ గోపి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.