కౌంటింగ్ డే : తెలంగాణలో పోలీసుల హై అలర్ట్

కౌంటింగ్ డే : తెలంగాణలో పోలీసుల హై అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ అంతా సిద్ధం చేసింది. ఆదివారం (డిసెంబర్ 3) రాష్ట్రంలోని దాదాపు 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా హైఅలర్ట్ ప్రకటించింది రాష్ట్ర పోలీస్ శాఖ. 

ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు  సందర్భంగా తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు డీజీపీ అంజనీకుమార్.

కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుమికూడకుండా 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని అధికారులను కోరారు డీజీపీ.  ఫలితాల తర్వాల రాజకీయ సమూహాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయోత్పవ ర్యాలీలో విషయంలో జాగ్రత్త వహించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులను కోరారు.