SI తుది ఫలితాలు విడుదల

SI తుది ఫలితాలు విడుదల

తెలంగాణలో SI పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి . పోలీసు నియామక మండలి జాబితాను విడుదల చేసింది. 1,272 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును వెబ్‌సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సివిల్ 710,AR 275, TSSC 175,ITSI 29, ఫింగర్ ఫ్రింట్ విభాగంలో 26 పోస్టులు భర్తీ అయ్యాయి. 992 మంది పురుషులు, 280 మంది మహిళలు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు..

తుది జాబితాపై ఎలాంటి అనుమానాలున్నా ఫీజు చెల్లించి నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది.