ప్రజా సంఘాల నేతలపై అర్బన్ నక్సల్స్ ముద్ర.. లిస్ట్‌లో 60 మంది

ప్రజా సంఘాల నేతలపై అర్బన్ నక్సల్స్ ముద్ర.. లిస్ట్‌లో 60 మంది

ప్రజా సంఘాల నేతల పై అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 60 మంది పేర్లను అర్బన్ నక్సల్స్ లిస్ట్ లో చేర్చారు. లిస్ట్‌లో మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతోపాటు, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు.

తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి విభాగం, చైతన్య మహిళా సమాఖ్య, డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలు.. ఇలా మొత్తం 60 మందిని అర్బన్ నక్సల్స్‌గా పరిగణిస్తూ వారి పేర్లను లిస్టు చేసి, వారిపై ఉపా(UAPA) చట్టం కింద వివిధ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు పోలీసులు.

అక్టోబర్ 19, 2019 న చర్ల పోలీస్ స్టేషన్లో 45 మందికి పైగా మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నేతలపై కేసు నమోదైంది. నవంబర్ 12, 2019లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు రవి శర్మ, అనురాధ, సుదర్శన్, సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు, మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు వేణుగోపాల్, మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రెటరీ హరి భూషణ్, విరసం నేతలు ప్రొఫెసర్ వేణుగోపాల్ పైన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎల్బీనగర్ లో నమోదైన కేసులో ఏ-8 గా ఓయూ ప్రొఫెసర్ కాశీం ఉన్నారు. కాశీంకు మావోయిస్టులతో ఉన్న సంబంధాల ఆధారాలను రేపు హైకోర్టులో సమర్పించనున్నారు పోలీసులు. మొత్తం 60 మందికి మావోయిస్టులతో లింకులు, ఆధారాలు, వారిపై నమోదు చేసిన కేసుల వివరాలను పోలీసులు కోర్టు ముందు ఉంచనున్నారు.

Telangana police stamps as Urban Naxals on public unions leaders, and registering cases