కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ.. మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తాం

కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ.. మైనార్టీల  రిజర్వేషన్లు రద్దు చేస్తాం

 మిగులు బడ్జెట్ తో ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. స్కాంలకు అయితే లెక్కే లేదని ఆరోపించారు.  అవినీతి తప్ప.. ప్రజలకు బీఆర్ఎస్  సర్కార్ చేసిందేమీ లేదని అన్నారు. 2023, నవంబర్ 25వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్ అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సుదీర్ఘ పోరాటాలు చేసి..1200 మంది యువత బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.  ఆశించినట్లు .స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో యువత, పేదలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన చెప్పారు.

 మిగలు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఈ పదేళ్లలో దివాలా తీసిందని అన్నారు. కేజీ టు పీజీ విద్యను గాలికొదిలేశారని..  ఉద్యోగాలు భర్తీ చేయలేదని.. రైతు రుణమాఫి పూర్తి చేయలేదని..  నిరుద్యోగ భృతి అమలు చేయలేదని.. .ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ అమలు కాలేదని తీవ్ర విమర్శలు చేశారు అమిత్ షా.  మిషన్ కాకతీయలో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదని.. దళితబంధులోనూ అవినీతి జరిగిందని చెప్పారు.పేపర్ లీకేజ్ ఎట్లా జరిగిందో అందరికీ తెలుసన్నారు. 
పాస్ట్ పోర్ట్, మియాపూర్ భూములు,  ఔటర్ రింగ్ రోడ్, గ్రానైట్, మనీ లాండరింగ్ వంటి స్కాంలతో కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళితబంధు పథకాలు వస్తున్నాయని అన్నారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో చేరటం ఖాయమని అన్నారు.

మతపరమైన రిజర్వేసన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని... ముస్లీంలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు.   బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామన్నారు.   బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తూ.. మెదట క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.  కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చామని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది... మీ ఓటు భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అమిత్ షా చెప్పారు.