మెహిదీపట్నం, వెలుగు: శక్తి స్కీంలో భాగంగా పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు ఐదోరోజు గురువారం తరగతులను బహిష్కరించి, నిరసన తెలిపారు.
శక్తి స్కీం జీవోను రద్దు చేయాలి
ఉప్పల్: శక్తి స్కీం జీవో నంబర్ 97ను రద్దు చేయాలని రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. వారు చేపడుతున్న ఆందోళన గురువారం నాలుగో రోజుకు చేరింది. బీఆర్‌ఎస్‌వీ నాయకులు వారికి మద్దతు తెలిపారు.
అబ్దుల్లాపూర్ మెట్ లో ఆందోళన..
అబ్దుల్లాపూర్ మెట్: జీవో 97ను రద్దు చేయాలంటూ అబ్దుల్లాపూర్ మెట్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం ధర్నా చేపట్టారు. పోలీసులు వచ్చి వారిని పక్కకు తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు.
