- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: స్కూళ్లు సమాజానికి బలమైన పునాదులని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లిలో విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లకు వర్క్‌షాప్‌కు ఆది శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, వేములవాడలోనూ త్వరలో ఈ స్కూల్ అందుబాటులోకి వస్తుందన్నారు.
ప్రజా ప్రతినిధులు తరచూ స్కూళ్లను సందర్శించాలని విప్ సూచించారు. కార్యక్రమంలో డీఈవో జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్లు ప్రభాకర్, మల్లేశం, కోనరావుపేట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.
