ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలి

ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలి
  •     తెలంగాణ పబ్లిక్​ సెక్టార్​ ఎంప్లాయీస్​ ఫెడరేషన్​ 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్​ సెక్టార్​ ఎంప్లాయీస్​ ఫెడరేషన్​ కోరింది. శనివారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​ రెడ్డిని ఫెడరేషన్​ చైర్మన్​ బాలకృష్ణ, సెక్రటరీ జనరల్  జీవన్​ కలిసి వినతపత్రం అందజేశారు. పదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చతికిలపడ్డాయని, వాటి భవిష్యత్ ​ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వెంటనే వాటిపై రివ్యూ చేయాలని సీఎంను కోరారు.​

కార్పొరేషన్లలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయినందున రిక్రూట్మెంట్ చేపట్టాలన్నారు. పబ్లిక్​ సెక్టార్​ సంస్థల్లోని కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల పే స్కేల్​ను​ రివైజ్​ చేయాలన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య  కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల విభజన జరగలేదని, వాటి విభజనకు  చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి అమలు చేసేందుకు ఆదేశాలివ్వాలని సీఎంను  కోరారు.