- తెలంగాణలో 25 వేల మంది టాలెంట్ పర్సన్స్:ఎక్స్ ఫెనో రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: నిపుణుల లభ్యతలో తెలంగాణ రాష్ట్రం తన పట్టు నిలుపుకుంది. ఎక్స్ఫెనో రిపోర్ట్ ప్రకారం పాజిటివ్ టాలెంట్ బ్యాలెన్స్ ఉన్న ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ జాబితాలో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. మొదటిస్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో హర్యానా ఉంది. తెలంగాణలో గతేడాది మార్చి నాటికి 77,800 మంది నిపుణులు రాగా 52,300 మంది వెళ్లారు. నికరంగా 25,500 మంది రాష్ట్రంలోనే ఉన్నారు. జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు నిపుణులను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 48.8 లక్షల మంది వైట్ కాలర్ నిపుణులు ఉండగా, వీరిలో సగం మంది అనుభవజ్ఞులే! ఐటీ రంగం 39 శాతం వాటాతో మొదటిస్థానంలో ఉంది. ఏడాదికి లక్ష మంది ఇంజనీరింగ్ పట్టా తీసుకుంటున్నారు. బెంగళూరు నుంచి 4 లక్షల మంది నిపుణులు హైదరాబాద్ రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అమెరికా నుంచి కూడా టాలెంట్ వస్తోంది. ఇది తెలంగాణను గ్లోబల్ హబ్ గా మారుస్తోందని ఎక్స్ఫెనో రిపోర్ట్ వెల్లడించింది.
