కరెంట్​ వాడకంలో తెలంగాణ రికార్డు

కరెంట్​ వాడకంలో తెలంగాణ రికార్డు

హైదరాబాద్, వెలుగు: వేసవి కాలం ప్రారంభంలోనే రాష్ట్రం విద్యుత్ వాడకంలో రికార్డులను తిరగ రాస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగంలో పీక్ డిమాండ్‌‌ను అధిగమించినట్లు ట్రాన్స్ కో, జెన్ కో వర్గాలు వెల్లడించాయి. గతేడాది మార్చి 31న 13,688 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వాడకం నమోదు కాగా.. శనివారం మధ్యాహ్నం 2.57 గంటలకే 13,742 మెగావాట్ల పీక్ డిమాండ్ రికార్డు చేసింది. కొత్త రాష్ట్రంలో ఇదే అత్యధిక వాడకమని.. రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత  పెరగొ చ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 14,500 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గ్రేటర్‌‌లో కరెంటు వినియోగం పెరగడంతో పాటు యాసంగి పంటకు మోటార్ల ద్వారా నీరు అందిస్తుండటంతో డిమాండ్ ఎక్కువైందని అధికారులు తెలిపారు.