తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 33,402కి చేరింది. ఇక  కరోనా కారణంగా శనివారం ఒక్కరోజే 9మంది మరణించగా..మొత్తం మరణించిన వారి సంఖ్య 348కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కరోనా వైరస్ వ్యాపించిన 1,178కేసులలో హైదరాబాద్ లో 736,రంగారెడ్డి-125 , మేడ్చల్‌-101 , కరీంనగర్‌- 24 , సిరిసిల్ల- 24 , వరంగల్‌ అర్బన్‌- 20, సంగారెడ్డి -13 లలో ఎక్కువ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.