టీజీ పవర్ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్ కు 695 కోట్లు

 టీజీ పవర్ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్ కు 695 కోట్లు
  • రిలీజ్ చేసిన ప్రభుత్వం
  • ఏపీ అకౌంట్‌‌లో జమ చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్​కు ప్రభుత్వం రూ.695 కోట్లు రిలీజ్​చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కరెంట్​అకౌంట్‌‌లో జమ చేయాలని ఆదేశించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్​ బాండ్ల రుణాల తిరిగి చెల్లింపు పథకం కింద టీజీపీఎఫ్​సీఎల్​ వాటాపై ప్రిన్సిపల్, వడ్డీ ఖర్చుల చెల్లింపు కోసం ఈ మొత్తం డబ్బులను వెచ్చించాల్సిందిగా విద్యుత్​ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇంధన శాఖ ప్రభుత్వ సహాయ కార్యదర్శి ఈ మొత్తాన్ని ‘ఆంధ్రప్రదేశ్​పవర్​ఫైనాన్స్ కార్పొరేషన్​లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఎస్ బీఐ కరెంట్​ ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. మంజూరు చేసిన మొత్తానికి టీజీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ యుటిలైజేషన్ సర్టిఫికేట్‌‌ను సమర్పించాలని కోరారు.