
హైదరాబాద్: రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 95,355 మందికి టెస్టులు నిర్వహించగా.. 3590 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1160 మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 3,555 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,447యాక్టివ్ కేసులున్నాయి.