మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌ వ్యాలిడిటీ పెంపు

V6 Velugu Posted on Jan 29, 2022

భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)  కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం సంస్థలకు షాక్ ఇచ్చింది. మొబైల్ యూజర్లకు మేలు జరిగేలా సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ప్యాక్ ల విషయంలో వ్యాలిడిటీని పెంచాల్సిందేనని టెలికాం సంస్థలకు తేల్చి చెప్పింది. ఇకపై ప్రతి సంస్థ 28 రోజులకు కాకుండా 30 రోజుల కాల పరిమితితో రీఛార్జ్ ప్యాక్ లను తీసుకురావాలని ఆదేశించింది. గతంలో మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభించేవి. ఆ తర్వాత వీటిని అన్ని టెలికాం సంస్థలు 28 రోజులకు తగ్గించాయి. దాని ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో.. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకురావాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది.

Tagged trai, pre-paid mobile recharge, 30-day validity

Latest Videos

Subscribe Now

More News