యూనివర్సిటీల్లో అసిస్టెంట్.. ప్రొఫెసర్ల భర్తీకి కొత్త రూల్స్

యూనివర్సిటీల్లో అసిస్టెంట్.. ప్రొఫెసర్ల భర్తీకి  కొత్త రూల్స్
  • నియామక మార్గదర్శకాలను సవరిస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు
  • టీజీసీహెచ్ఈ ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు
  • 12 యూనివర్సిటీల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మార్గం సుగమం 
  • అకడమిక్ రికార్డు, రీసెర్చ్, టీచింగ్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెయిటేజీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి  ప్రభుత్వం నిబంధనలను సవరించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పారదర్శకంగా చేపట్టేందుకు  ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం జీవో 31ని రిలీజ్ చేశారు. గతంలో ఇచ్చిన జీవో21లోని నిబంధనలకు కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

కౌన్సిల్ స్క్రీనింగ్ కమిటీ.. 

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలను పరిశీలించేందుకు తెలంగాణ స్టేట్​ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజీసీహెచ్ఈ) ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా అకడమిక్ రికార్డు, రీసెర్చ్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గరిష్టంగా 50 మార్కులను కేటాయించారు.  ఇందులో గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 15 మార్కులు(80% పైబడితే 15, 60-–80% మధ్య 13, 55–-60% మధ్య 10, 45–-55% మధ్య 5 మార్కులు), పోస్ట్ గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 25 మార్కులు (80% పైబడితే 25, 60-–80% మధ్య 23, 55–-60% మధ్య 20 మార్కులు)కేటాయించగా.. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఉన్నవారికి నేరుగా 30 మార్కులు లభించనున్నాయి.

 ఇక నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉన్నవారికి 7 మార్కులు, నెట్ కు 5, ఎస్సెట్/సెట్ కు 3 మార్కులు దక్కనున్నాయి. అలాగే పీర్-రివ్యూడ్ జర్నల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రచురితమైన ప్రతీ రీసెర్చ్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2 మార్కుల చొప్పున గరిష్టంగా 10 మార్కులు, పోస్ట్ డాక్టోరల్/టీచింగ్ అనుభవానికి మరో 10 మార్కులు, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులకు 2 నుంచి 3 మార్కుల వరకు వెయిటేజీ కల్పించారు.

డెమోకు 10 మార్కులు..

కేటగిరి బీ కింద డొమైన్ నాలెడ్జ్, బోధనా నైపుణ్యాల అంచనా కోసం మరో 30 మార్కులను కేటాయించారు. ఇందులో డెమో ద్వారా టీచింగ్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 10 మార్కులు, డొమైన్ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 10 మార్కులు, రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 మార్కులు, పుస్తకాల ప్రచురణకు  5 మార్కులను కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని 
ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంజినీరింగ్ వాళ్లకు టెస్ట్ లేదు.. 

ఇంజినీరింగ్, టెక్నికల్ కోర్సుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించింది. నెట్, సెట్ పరీక్షలు లేని ఇంజినీరింగ్ తదితర స్పెషలైజ్డ్ విభాగాల అభ్యర్థుల కోసం గతంలో టీజీసీహెచ్ఈ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ టెస్ట్ నిర్వహించే నిబంధనను తాజాగా ఎత్తివేశారు. దీనికి బదులుగా, నెట్/సెట్ కోసం కేటాయించే 7 మార్కులు మినహాయించి, మిగతా విభాగాల ఆధారంగా అభ్యర్థుల స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 93 మార్కులకు లెక్కిస్తారు. ఆ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వంద మార్కులకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా పోలేట్ చేసి, చివరికి 50 మార్కుల వెయిటేజీకి అనుగుణంగా క్రమబద్ధీకరించనున్నారు. ఈ నియామక ప్రక్రియలో పూర్తిగా ఏఐసీటీఈ రెగ్యులేషన్స్ అమలవుతాయని జీవోలో స్పష్టం చేశారు.