Asian Shooting Champion : షూటర్ తనిష్క్ కు టీఆర్ఏ సత్కారం

Asian Shooting Champion : షూటర్ తనిష్క్ కు టీఆర్ఏ సత్కారం

హైదరాబాద్, వెలుగు: ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్​లో  రెండు మెడల్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన స్టేట్ షూటర్ కొడవలి తనిష్క్‌‌ను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) సత్కరించింది. గచ్చిబౌలిలోని శాట్జ్‌‌‌‌‌‌‌‌ షూటింగ్ రేంజ్‌‌‌‌‌‌‌‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో తనిష్క్‌‌‌‌‌‌‌‌ను టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ అభినందించారు. తనిష్క్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ విభాగంలో కాంస్య, టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణం సాధించాడు. ఇదే టోర్నీలో కాంస్యం నెగ్గిన ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ను కూడా అభినందించిన అమిత్​ సంఘీ స్టేట్‌‌‌‌‌‌‌‌ షూటర్లకు అత్యుత్తమ శిక్షణా సదుపాయాలతో పాటు వారికి అవసరమైన పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.