గుస్తీ నోరియాకు గోల్డ్.. తెలంగాణ షూటర్లకు 8 మెడల్స్‌‌‌‌‌‌‌‌

గుస్తీ నోరియాకు గోల్డ్..  తెలంగాణ షూటర్లకు 8 మెడల్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: నేషనల్ షూటింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ షూటర్లు 8 మెడల్స్​తో సత్తా చాటారు.  నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు మూడు కాంస్యాలు కైవసం చేసుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ మెగా టోర్నీలో  వెటరన్ షూటర్ గుస్తీ నోరియా క్లే పీజియన్ స్కీట్ షూటింగ్  మాస్టర్ మెన్స్  విభాగంలో గోల్డ్ నెగ్గాడు. ఫైనల్లో తను 41 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించాడు.

 క్లే పీజియన్ ట్రాప్  సీనియర్ మాస్టర్ మెన్స్ కేటగిరీలో డారియస్ చెనాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్ నెగ్గగా.. స్కీట్ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ జూనియర్ టీమ్ విభాగంలో యువెక్ బత్తుల –వెంకట లక్ష్మి జోడీ బంగారు పతకం గెలిచింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ విభాగంలో  మహ్మద్ అబ్దుల్ ఖలిక్ గోల్డ్ అందుకున్నాడు. నేషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడల్స్ నెగ్గిన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటర్లను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ అభినందించారు.