ఖేతికి గ్లోబల్‌‌‌‌ అవార్డ్‌‌‌‌

 ఖేతికి గ్లోబల్‌‌‌‌ అవార్డ్‌‌‌‌

న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్టప్ కంపెనీ  ఖేతి 10 లక్షల పౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల (రూ.10 కోట్ల) ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీని గెలుచుకుంది.  బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన  ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీలో  ఈ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ  విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. మొత్తం ఐదు  కంపెనీలను  గాలా గ్రీన్ కార్పెట్ అవార్డ్స్  ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విన్నర్లుగా ప్రకటించారు. ‘నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రక్షించడం, తిరిగి పునరుద్ధరించడం’ కేటగిరీలో ఖేతి ఈ అవార్డును గెలుచుకుంది. గ్రీన్ హౌస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తూ  చిన్న రైతులు తమ పంట ఖర్చులను తగ్గించుకోవడంలో, ఆదాయాన్ని పెంచుకోవడంలో  ఖేతి సాయపడుతోంది. భూమి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలను ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మనం పరిష్కరించగలమనే నమ్మకం ఉందని బ్రిటన్ ప్రిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలియమ్ అన్నారు.  వాతావరణ మార్పుల వలన ఎక్కువగా నష్టపోతున్న 10 కోట్ల మంది చిన్న రైతులకు సాయం చేస్తున్నామని ఖేతి ఫౌండర్ కౌశిక్ కప్పగంతుల పేర్కొన్నారు. ఈ కంపెనీ రైతుల కోసం గ్రీన్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. 

దీంతో  కీటకాలు, వాతావరణ మార్పుల నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులకు వీలుంటుంది. ‘ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజ్ మమల్ని గుర్తించడం ఆనందంగా ఉంది. ప్రపంచం చిన్న రైతులపై ఆధారపడుతోంది. అయినప్పటికీ, వీరి జీవితాలు మెరుగవ్వడం లేదు’ అని కౌశిక్ అన్నారు. దేశంలోని రైతుల జీవితాలను తమ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఏ– బాక్స్  మెరుగుపరుస్తోందని చెప్పారు.  ఖేతి తీసుకుంటున్న చర్యలతో రైతుల జీవితాలు మెరుగువుతున్నాయని అన్నారు. గ్రీన్ హౌస్ షెల్టర్లలోని పంటలకు బయట వేసే పంటలతో పోలిస్తే 98 శాతం తక్కువ నీరు అవసరం ఉంటుంది. దిగుబడి మాత్రం ఏడు రెట్లు ఎక్కువగా వస్తుంది. స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్ హౌస్ కంటే 90 శాతం తక్కువ రేటుకే గ్రీన్ హౌస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని  కౌశిక్ పేర్కొన్నారు. ఇవి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తున్నాయని చెప్పారు.  తక్కువ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఎరువులను వాడుతూ భూమిని కూడా వీరు కాపాడుతున్నారని వివరించారు. మరో ఇండియన్ స్టార్టప్ కంపెనీ ఫూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పైనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యింది. ఈ కంపెనీ గంగా నదిలో కొట్టుకుపోతున్న పూలను సేకరించి లెదర్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేస్తోంది. వీటిని ఫ్లెదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పిలుస్తోంది. ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాట్స్  ప్రైజ్ కోసం గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 1,000 కి పైగా అప్లికేషన్లను వచ్చాయి. ఇందులో 15 మందిని పైనలిస్టులను ఎంచుకున్నారు. వీటిలో ఐదుగురిని విన్నర్లుగా ప్రకటించారు.