రైతు రుణమాఫీపై క్యాబినెట్ కీలక నిర్ణయం: ఒకే విడతలో రూ.2లక్షలు మాఫీ

రైతు రుణమాఫీపై క్యాబినెట్ కీలక నిర్ణయం: ఒకే విడతలో రూ.2లక్షలు మాఫీ

తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం క్యాబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో రూ.2లక్షల రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే 2024 ఆగస్ట్ 15 లోపే రైతులందరికీ రుణ మాఫీ అమలు చేస్తామని క్యాబినెట్ స్పష్టం చేసింది.  ఒకే విడతలో రూ.2లక్షల రుణ మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. 2023 డిసెంబర్ 9 కంటే ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.