బ్రేకింగ్: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు.. గెజిట్ విడుదల చేసిన

బ్రేకింగ్:  స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు.. గెజిట్ విడుదల చేసిన

స్థానిక ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ గెజిట్ జారీ చేసింది.  హైకోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ను జారీ చేసిన సంగతి తెలిసిందే.దీని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించి..అక్టోబర్ 9న  నోటిఫికేషన్ జారీ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ . అయితే జీవోపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా స్టే విధించింది హైకోర్టు. 

అయితే హైకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గెజిట్ జారీ చేసింది.  దీంతో తెలంగాణలో స్థానిక  సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. ఇవాళ వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావు. స్థానిక ఎన్నికలపై తదుపరి ప్రకటన వచ్చే వరకు  ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది.