తొమ్మిది నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి

 తొమ్మిది నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి
  •     తెలంగాణ స్టేట్ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ 

బషీర్ బాగ్​, వెలుగు :   పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... నాంపల్లి లోని భూపరిపాలన కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ స్టేట్ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగులు నిరసన తెలిపారు.  . ధరణి విభాగంలో 2018 నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తుండగా  9 నెలలుగా జీతాలు రావడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన  ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు , భూసంబంధిత సమస్యల పరిష్కారం కోసం 713 మందిని విధుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివిన తాము , చాలీచాలని జీతాలతో పని చేస్తున్నామన్నారు.  పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేసి , జీవో నెంబర్ 63 ప్రకారం 31 వేల జీతాన్ని నేరుగా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. అనంతరం  భూపరిపాల కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.  అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొల్ల నాగరాజు, గడం హిమేష్ కుమార్, రాంబాబు, శ్రీధర్ , వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్  ఉన్నారు.