కరువు భత్యం బకాయిలు వెంటనే ఇవ్వాలి

కరువు భత్యం బకాయిలు వెంటనే ఇవ్వాలి
  • తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్  డిమాండ్ 

ముషీరాబాద్,వెలుగు : మూడు కరువు భత్యం బకాయి వాయిదాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో రిటైర్డ్ పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరింది. బుధవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ నరసింగరావు అధ్యక్షతన రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది.

పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ టి. సుధాకర్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. రాజేంద్రబాబు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పెన్షనర్స్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్  మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

లేకుంటే జూలై నుంచి తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టంచేశారు. అనంతరం అసోసియేషన్ కు సేవలందించే ఇ. నరసింహారెడ్డి, వీఆర్ దేశ్ పాండే ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో బి. నర్సయ్యతో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.