సిరిసిల్లలో కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పర్యటన

సిరిసిల్లలో కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పర్యటన

రాజన్న సిరిసిల్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు గురువారం సిరిసిల్లలో పర్యటించారు. ఇటీవల సెస్ మాజీ చైర్మన్ చిక్కల రామారావు కొడుకు చనిపోయిన విషయం తెలిసిందే. గురువారం బాధిత కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లిన వారు.. బుధవారం తంగళ్లపల్లిలో పానీపూరి తిని అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన  పరామర్శించారు. 

చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న వైద్య సేవల వివరాలను పరిశీలించి, బాధిత పిల్లలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ జిందం కళ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు చక్రపాణి, తోట ఆగయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.