తెలంగాణలో అతి భారీ వర్షాలు, భారీ వర్షాలు పడే జిల్లాలు ఇవే

తెలంగాణలో అతి భారీ వర్షాలు, భారీ వర్షాలు పడే జిల్లాలు ఇవే

వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది.  రాష్ట్రంలో జులై 4వ తేదీ నుంచి  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలలో అక్కడక్కడ అతి భారీ వర్షం పడనుందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్సుందని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

రూతుపవనాలు చురుగ్గా కదలడం తో అవర్తనలు ఏర్పడుతున్నాయని..అందుకే  రాష్ట్రంలో రాగల మూడు రోజులు  రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  అనేక చోట్ల  కురిసే అవకాశం ఉందని..పలు ప్రాంతాల్లో  ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం  పడనుందని  పేర్కొంది. 

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.