ఆదాయం 35,024 కోట్లు.. అప్పులు 15,885 కోట్లు

ఆదాయం 35,024 కోట్లు.. అప్పులు 15,885 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రాష్ట్ర ఖజానాకు మొత్తంగా రూ.50,910 కోట్లు సమకూరింది. ఇందులో దాదాపు రూ.35 వేల కోట్లు టాక్స్ అండ్ నాన్ టాక్స్ రెవెన్యూ కాగా.. మిగతా మొత్తం అప్పుల రూపంలో తీసుకున్నది. మూడు నెలల్లో ఏప్రిల్, మే, జూన్​లలో రూ.15,885 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ తాజా రిపోర్ట్​లో వెల్లడించింది. 

దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఆదాయంలో జీఎస్టీతో రూ.11,418 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్​లో రూ.3,510 కోట్లు, ఎక్సైజ్​ ఆదాయం రూ.7,532 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.2,988 కోట్లు, ఇతర పన్నులు డ్యూటీలతో రూ.1,868 కోట్లు, నాన్ టాక్స్ రెవెన్యూ రూ.1,488 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కింద రూ.1,811 కోట్లు వచ్చింది.