వ్యాక్సిన్ వేస్టేజ్ లో తెలంగాణ రాష్ట్రం టాప్

వ్యాక్సిన్ వేస్టేజ్ లో తెలంగాణ రాష్ట్రం టాప్

కేంద్ర ప్రభుత్వం పంపిన టీకా వేస్టేజ్ లో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని విమర్శించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. 17.8% వ్యాక్సిన్ ఉపయోగం లేకుండా పోతోందన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అర్వింద్ ..వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రం పై విమర్శలు చేస్తావా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీకి సలహాలు ఇచ్చేంతవాడివయ్యావా అంటూ ఫైర్ అయ్యారు.

రాత్రి 8 తర్వాత సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడుతాడో ఇప్పటికే ప్రజలకు తెలుసన్న ఎంపీ అర్వింద్..ఇప్పుడు కేటీఆర్ కూడా రాత్రి 8 గంటల తర్వాతనే మాట్లాడుతున్నారన్నారు.నేషనల్ మీడియా కవర్ చేసేప్పుడు.. తండ్రి, కొడుకు రాత్రి టైంలో నే ఎందుకు మాట్లాడుతున్నారో తెల్సుకోవాలన్నారు. అంతేకాదు..”ట్విట్టర్ మీద ఆగం చేసే చిన్న పిట్టల దొరా,ఆ దేశం ఈ దేశం గురించి నీ మేధో మధనం తర్వాత చేయొచ్చు..ముందు తెలంగాణకి ఇచ్చిన వ్యాక్సిన్లను వేస్ట్ చేయకుండా ప్రజలకు చేరే మార్గం చూడు..నువ్వు మీ నాన్న కాస్త పదార్థాల మత్తులో నుండి బయట పడి యదార్థాలను మాట్లాడండి” అని అన్నారు.