మోకాళ్లపై కూర్చొని నిరసన

మోకాళ్లపై కూర్చొని నిరసన

కాచిగూడ: జీఓ 7 వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కాచిగూడలో ‘చదువుకుంటాం కానీ ఫీజుల భారం మాపై వేయొద్దు’ అంటూ నల్ల కండువాలు ధరించి, జీఓ కాపీలతో మోకాళ్లపై కూర్చొని విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఫీజు బకాయిల జమపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ఇది కార్పొరేట్ సంస్థల దోపిడీకి దారితీస్తోందని విమర్శించారు.