Telangana Summer Tour : తెలంగాణలో 33 జిల్లాల్లోని టూరిజం ప్రాంతాలు ఇవే.. జాలీగా ఫ్యామిలీతో వెళ్లొద్దామా..!

 Telangana Summer Tour : తెలంగాణలో 33 జిల్లాల్లోని టూరిజం ప్రాంతాలు ఇవే.. జాలీగా ఫ్యామిలీతో వెళ్లొద్దామా..!

తెలంగాణలో విస్తృతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రాచీన ఆలయాలు, వారసత్వ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ప్రకృతికి సంబంధించిన పర్యాటక గమ్యస్థానాలు 33 జిల్లాల్లో విస్తరించి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాలపైన పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తాయి. జిల్లాల వారీగా పర్యాటక ప్రదేశాల వివరాలను తెలుసుకుందాం....
  
హనుమకొండ: ఆలయాలు: భద్రకాళి ఆలయం, పద్మాక్షి ఆలయం, 100 స్తంభాల గుడి. వారసత్వ ప్రదేశాలు: 1000 స్తంభాలు, వరంగల్ కోట, వన్యప్రాణుల అభయారణ్యం: వన విజ్ఞాన కేంద్రం, మినీ జూ, ప్రకృతి ఆవిష్కరణలు: మ్యూజికల్ గార్డెన్, రాక్ గార్డెన్, రీజినల్ సైన్స్ సెంటర్, పాకాల్ సరస్సు.

ములుగు: ఆలయాలు: రామప్పదేవాలయం, సమక్క సారలమ్మ జాతర, వారసత్వ ప్రదేశాలు: రామప్ప దేవాలయం, వన్యప్రాణుల అభయారణ్యం: ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం, ప్రకృతి ప్రదేశాలు: లక్నవరం సరస్సు.

రామప్ప ఆలయం: ఇది శివాలయానికి ప్రసిద్ధి. దీనిని కాకతీయ రాజులు నిర్మించారు. దీనిని 2021లో యునెస్కో  ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది ములుగు నుంచి 15 కి.మీ.లో ఉండి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. 

లక్నవరం సరస్సు: ఇది ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉంది. అందమైన పచ్చటి కొండల వలయంతో చుట్టిఉన్న ఒక విశాలమైన సరస్సు. ఇక్కడ పచ్చని ద్వీపాలు, నిర్మలమైన జలాలు, పొడవైన వేలాడే వంతెన ఉంది. 160 మీటర్ల పొడవైన వేలాడే వంతెన ఈ గమ్యస్థానపు ప్రత్యేక ఆకర్షణ. 

గట్టమ్మ దేవాలయం: ఇది ఒక స్థానిక గిరిజన దేవత గట్టమ్మ గుడి. రాష్ట్రం నలుమూలల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. 

జయశంకర్ భూపాలపల్లి: ఆలయాలు: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, ప్రకృతి ప్రదేశాలు: బొగత జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యం: తాడ్వాయి వన్యప్రాణుల అభయారణ్యం.

తాడ్వాయి వన్యప్రాణుల అభయారణ్యం: వన్యప్రాణుల ప్రాముఖ్యం దృష్ట్యా ఈ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్ర అటవీశాఖ ఇక్కడ వనజీవన్ (తాడ్వాయి హట్స్ – కాంప్లెక్స్) అనే అటవీ రిపోర్టును లోతైన రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో నిర్మించి అభివృద్ధి చేసింది. 

దామరవాయి: తాడ్వాయి నుంచి 15 కి.మీ.ల దూరంలోని దామరవాయిలో మెగాలలిథిక్ శ్మశాన నిర్మాణాలు ఉన్నాయి. ఈ సమాధులు 10,000 ఏండ్ల క్రితం ఇక్కడ చరిత్ర పూర్వ మానవుని ఉనికికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇవి ప్రత్యేక నిర్మాణాలు మెగాలిథిక్ నిర్మాణపు ఒకే గది – రెండు లేదా అంత కంటే ఎక్కువ నిర్మాణాలతో క్యాప్స్టోన్ యుక్తంగా క్షితజ సమాంతరంగా ఉంది. 

►ALSO READ | Beauty Tips: ఫేస్ బ్యూటీ.. వేపనూనెతో.. చర్మం మెరిసిపోతుంది..

మల్లూరు: ఇది ఏటూరునాగారం నుంచి 5 కి.మీ.ల దూరంలో ఉంది. అడవి గుండా ప్రవహించే నీటి బుగ్గ చింతామణి జలపాతం ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైంది. 

బొగత జలపాతాలు: వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో ఉంది. ఈ అందమైన జలపాతం దట్టమైన అడవిలో 30 మీటర్ల పొడవుతో 200 మీటర్ల వరకు ఉంటుంది. దీన్ని స్థానికంగా తెలంగాణ నయాగరా జలపాతం అంటారు. 

నిర్మల్:ఆలయాలు: బాసర సరస్వతీ ఆలయం, కాల్వ నరసింహా స్వామి ఆలయం, వారసత్వ ప్రదేశం: నిర్మల్​ కోట, ప్రకృతి ప్రదేశం: కడెం ప్రాజెక్టు.

ఆదిలాబాద్: ఆలయాలు: జైనత్ ఆలయం, ప్రకృతి ఆవిష్కరణ: గాయత్రి, కుంటాల, పొచ్చెర జలపాతాలు

మంచిర్యాల: వన్యప్రాణి అభయారణ్యాలు: శివరాం వన్యప్రాణి అభయారణ్యం(పెద్దపల్లి జిల్లాలోనూ ఉంది), జన్నారం, కావల్, ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యాలు

నిజామాబాద్: ఆలయాలు: డిచ్​పల్లి రామాలయం, కంఠేశ్వర్, ఖిల్లా రామాలయం, సారంగాపూర్ హనుమాన్ మందిరం, వారసత్వ ప్రదేశం: నిజామాబాద్ కోట, ప్రకృతి ఆవిష్కరణ: అలీసాగర్ రిజర్వాయర్, మల్లారం అడవి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, వన్యప్రాణి అభయారణ్యాలు: అలీసాగర్ జింకల పార్క్

కరీంనగర్: ఆలయాలు: నగునూరు ఆలయం, వారసత్వ ప్రదేశం: ఎలగందల కోట, మొలంగూరు కోట, ప్రకృతి ఆవిష్కరణ: దిగువ మానేరు డ్యాం, వన్యప్రాణి అభయారణ్యాలు: ఉజ్వల జింకల పార్క్.

పెద్దపల్లి: వారసత్వ ప్రదేశం: రామగిరి ఖిలా(కోర్టు), ధూళికట్ట. వన్యప్రాణి అభయారణ్యం: శివరాం వన్యప్రాణి అభయారణ్యం (మంచిర్యాలలోనూ ఉంది), ప్రకృతి ఆవిష్కరణ: సబితం జలపాతం

జగిత్యాల: ఆలయాలు: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం(ధర్మపురి). వారసత్వ ప్రదేశం: జగిత్యాల కోట

రాజన్న సిరిసిల్ల: ఆలయాలు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం.

సంగారెడ్డి: ఆలయాలు: కలబ్​గూర్ కాశీ విశ్వేశ్వర మందిరం, కేతకి సంగమేశ్వర ఆలయం, ఝార సంగం, వీరభద్ర స్వామి ఆలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం.వారసత్వ ప్రదేశం: సంగారెడ్డి జైలు మ్యూజియం, గొట్టం గుట్ట – ఇది గొట్టం గోటగా కూడా పిలుస్తారు. ఇది జహీరాబాద్ పట్టణంలో ఉంది. కొండాపూర్​లో ఉన్న పురావస్తు మ్యూజియం – ఈ మ్యూజియం పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన కళాఖండాలు ప్రదర్శిస్తున్నారు.  

సిద్దిపేట:ఆలయాలు: కోటి లింగేశ్వర స్వామి ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం, విద్యా సరస్వతి క్షేత్రం. 

నల్గొండ:  ఆలయాలు: మహాత్మాగాంధీ ఆలయం (చిట్యాల), వారసత్వ ప్రదేశం: దేవరకొండ కోట, కొలనుపాక జైన ఆలయం, నాగార్జున సాగర్, నందికొం, రాచకొండ కోట. ప్రకృతి ఆవిష్కరణ: నాగార్జున సాగర్. 

యాదాద్రి భువనగరి:ఆలయాలు: యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం, సురేంద్రపురి– పౌరాణిక థీమ్ పార్కు. వారసత్వ ప్రదేశం: భువనగరి కోట. 

రంగారెడ్డి:పర్యాటక గమ్యస్థానాలు: రామోజీ ఫిల్మ్​సిటీ, హైటెక్ సిటీ, ఉస్మాన్ సాగర్ డ్యాం, మహేశ్వరంలోని మత స్థలాలు, శిల్పారామం థీమ్ విలేజ్, ఓషియన్ పార్క్, శామీర్​పేట సరస్సు, అనంతగిరి కొండలు, ఆలయాలు: చిలుకూరి బాలాజీ మందిరం, సంఘీ మందిరం, కీసరగుట్ట, సమతామూర్తి విగ్రహం, వన్యప్రాణుల అభయారణ్యాలు: మహావీర్ వనస్థలి జాతీయపార్క్, మృగనయని జాతీయ పార్కు, చిల్కూరు.

వికారాబాద్:  ఆలయాలు: అనంత పద్మనాభ స్వామి ఆలయం, ప్రకృతి ఆవిష్కరణ: అనంతగిరి కొండలు.

మేడ్చల్ మల్కాజ్​గిరి: వన్యప్రాణుల అభయారణ్యం: శామీర్​పేట జింకల పార్క్, ప్రకృతి ఆవిష్కరణలు: శామీర్​పేట సరస్సు.

నాగర్ కర్నూల్: ఆలయాలు: లలిత సోమేశ్వర స్వామి దేవస్థానం, ఉమామహేశ్వర స్వామి ఆలయం, ప్రకృతి ఆవిష్కరణ: మల్లెల తీర్థం, పర్యాటక ప్రదేశాలు: సోమశిల రిజర్వాయర్ సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, శ్రీశైలం, సమీపంలోని శ్రీశైలం డ్యామ్, అక్కమహాదేవి గుహలు.

మన్ననూర్ టైగర్ పార్క్: ఇది కృష్ణా నది ఒడ్డున ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వులో భాగమై పొడి ఆకురాల్చే మిశ్రమ అడవి. 
ఫర్హాబాద్(అమ్రాబాద్ టైగర్ రిజర్వు): అమ్రాబాద్ టైగర్ రిజర్వు, నాగర్ కర్నూల్ జిల్లాలోని దట్టమైన నల్లమల అడవిలో ఉంది.  

ఖమ్మం: ఆలయాలు: జమలాపురం ఆలయం, కూసుమంచి శివలింగం(కల్లూరు), వారసత్వ ప్రదేశం: నేలకొండపల్లి విగ్రహాలు, ఖమ్మంకోట, ప్రకృతి ఆవిష్కరణ: పేరంటాలపల్లి కొండలు, వన్యప్రాణి అభయారణ్యాలు: కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం.
పేరంటాలపల్లి కొండలు: మేఘాలు కప్పుకున్న కొండశ్రేణి అని కూడా పిలిచే ఈ ప్రాంతం కూనవరం నుంచి పాపికొండల దారిలో ఉంది. ఈ ప్రదేశం నుంచి గోదావరి, శబరి నదుల సంగమాన్ని చూడవచ్చు. ఇది ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలంలోని ఒక మారుమూల గిరిజన గ్రామం.

భద్రాద్రికొత్తగూడెం: ఆలయాలు: భద్రాచలం సీతారామ స్వామి వారి ఆలయం, వారసత్వ ప్రదేశం: పర్ణశాల – శ్రీరామశకం.
మహబూబ్​ నగర్: ఆలయాలు: మన్యంకొండ (వేంకటేశ్వర ఆలయం), గంగాపురం, జడ్చర్ల (చెన్నకేశవస్వామి ఆలయం), సీతారామచంద్ర స్వామి ఆలయం, సిరిసనగండ్ల, కురుమూర్తి రాయుడు, కొత్తకోట, వారసత్వ ప్రదేశం: పిల్లలమర్రి, గొప్ప మర్రి చెట్టు, ప్రకృతి ఆవిష్కరణ: కోయిల్ సాగర్.

జోగులాంబ గద్వాల: ఆలయాలు: ఆలంపూర్ జోగులాంబ ఆలయం, వారసత్వ ప్రదేశం: గద్వాల్ కొండ కోట, ప్రకృతి ఆవిష్కరణ: ప్రియదర్శిని జూరాల ఆనకట్ట. 

వనపర్తి: ప్రకృతి ఆవిష్కరణ: సరళా సాగర్ ఆనకట్ట

మెదక్: ఆలయాలు: ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం, మెదక్ చర్చి, అల్లాదుర్గ్, వారసత్వ ప్రదేశం: మెదక్ కోట,  ప్రకృతి ఆవిష్కరణ: పోచారం రిజర్వాయర్ ఎదితనూర్(నియోలిథిక్ యుగాల నాటి అందమైన గుహల పెయింటింగ్​లకు పేరు గాంచిన గ్రామం) వన్యప్రాణి అభయారణ్యం: పోచారం వన్యప్రాణి అభయారణ్యం.