
సికింద్రాబాద్, వెలుగు : హైదరాబాద్‌నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం ఐదు గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. డైలీ ఉదయం 6 గంటలకు నాంపల్లి నుంచి న్యూఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్టెక్నికల్సమస్యల కారణంగా ఉదయం 11 గంటలకు బయలుదేరుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.