నగరంలో భారీగా పట్టుబడుతున్న నగదు

నగరంలో భారీగా పట్టుబడుతున్న నగదు

ఎన్నికల వేళ  నగరంలో అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడుతోంది. బుధవారం హైటెక్  సిటీ మెట్రో స్టేషన్ దగ్గర “జయభేరి” కి చెందిన సుమారు  రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నేడు.. నగరంలో మరో చోట  తనిఖీలు నిర్వహించి నగదును పట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ తనిఖీలు జరిగాయి. ఆడి కార్ నుంచి వోక్స్ వేగన్  కారు లోకి మారుస్తున్న రూ. 49 లక్షల రూపాయలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు. ఈ డబ్బును మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఇచ్చిన డబ్బుగా వారు గుర్తించారు. ఈ నగదును తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు ఏ పార్టీ అభ్యర్ధికి చెందినదిగా తెలియాల్సి ఉంది.